పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం దర్భగూడెంలో నూతనంగా మంజూరైన పింఛన్ల పత్రాలను లబ్ధిదారులకు పోలవరం ఎమ్మెల్యే అందజేశారు. పార్టీలకతీతంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పనులు చేపడుతున్నారని అన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించి వారి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. పెన్షన్‌కు దరఖాస్తు పెట్టుకున్న వెంటనే మంజూరు చేసే ఏకైక ప్రభుత్వం తమదేనని అన్నారు.
'అన్ని వర్గాల అభ్యున్నతే వైకాపా ప్రభుత్వ ధ్యేయం' - latest west godavari district news
రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతే ద్యేయంగా వైకాపా ప్రభుత్వం పని చేస్తుందని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. పింఛన్‌కు దరఖాస్తు పెట్టుకున్న వెంటనే మంజూరు చేసే ఏకైక ప్రభుత్వం తమదేనని అన్నారు
'అన్ని వర్గాల అభ్యున్నతే వైకాపా ప్రభుత్వ ధ్యేయం'
గ్రామ సచివాలయ వ్యవస్థతో ఇంటి వద్దకే పాలన అందిస్తూ అన్ని సంక్షేమ పథకాలను ప్రజల వద్దకే చేరుతున్నారని తెలిపారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా వాలంటీర్లు ఏర్పాటు చేసి రాజన్న రాజ్యం అమలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు కొల్లు రాంబాబు జి. శ్రీనివాసరావు, రాఘవరెడ్డి, బోడ శ్రీనివాస్ రెడ్డి, కక్కిరాల రాము, చక్రి తదితరులు పాల్గొన్నారు.
ఇది చదవండిఏలూరులో పెరుగుతున్న కరోనా కేసులు... లాక్డౌన్ దిశగా చర్యలు