ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసాపురం పురపాలక నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం - Narasapuram municipality latest news

నరసాపురం పురపాలక నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఛైర్​పర్సన్​గా బర్రి శ్రీ వెంకటరమణ, వైస్ చైర్మన్​గా కొత్తపల్లి భుజంగ రాయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

New governing body sworn in Narasapuram municipality
నరసాపురం పురపాలక నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

By

Published : Mar 18, 2021, 4:23 PM IST

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ ఛైర్​పర్సన్​గా బర్రి శ్రీ వెంకటరమణ, వైస్ చైర్మన్​గా కొత్తపల్లి భుజంగ రాయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పురపాలక కార్యాలయంలో జిల్లా ఉప ఎన్నికల అధికారి, నర్సాపురం సబ్ కలెక్టర్ కె.ఎస్ విశ్వనాథన్ ముందుగా ఎన్నికైన 31 మంది కౌన్సిలర్లుతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఛైర్​పర్సన్, వైస్ ఛైర్మన్ ఎన్నికను నిర్వహించారు. ఇతర పార్టీల నుంచి పోటీ లేకపోవడంతో బర్రి శ్రీ వెంకటరమణ, కొత్తపల్లి భుజంగరాయులు ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎక్స్అఫీషియో సభ్యులుగా శాసన మండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసినందున సభ్యులు దానికి లోబడి పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని మండలి చైర్మన్ షరీఫ్ కోరారు. స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు మాట్లాడుతూ.. పురపాలక అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details