పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో అవసరమైన చోట్ల నివారణ, అవగాహన కార్యక్రమంలో సరోజినీ దేవి మహిళా కళాశాల ఎన్సీసీ విద్యార్థులు పాల్గొంటున్నారు. తణుకు కూరగాయల మార్కెట్లో తెల్లవారుజామున వచ్చే వందలాది కొనుగోలుదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిబంధనల ప్రకారం సామాజిక దూరం పాటించి కొనుగోలు చేసేలా అవగాహన పెంచారు. కరోనా వైరస్ నివారణలో ప్రజలను చైతన్యం చేయటంలో తమ వంతు కృషి చేస్తున్నామని కార్యకర్తలు తెలిపారు.
'మేము సైతం' అంటున్న ఎన్సీసీ విద్యార్థులు - సరోజినీ దేవి మహిళా కళాశాల
కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని ఎన్సిసి విద్యార్థులు మేము సైతం అంటూ పాల్గొంటున్నారు. భౌతిక దూరం, కరోనా వైరస్ వ్యాపించకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
కరోనా నివారణ చర్యల్లో ఎన్సీసీ విద్యార్థులు