ప్రముఖ పుణ్య క్షేత్రం ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయానికి ఉపాలయమైన కుంకుళ్లమ్మ ఆలయం లో ఈనెల 17 నుంచి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాల్లో అమ్మవారు రోజుకొక అలంకారంలో భక్తులను అనుగ్రహించనున్నట్టు ఈవో భ్రమరాంబ తెలిపారు.
ఉత్సవాల వేళ నిత్యం అమ్మవారికి ఉదయం 7 గంటలకు కుంకుమ పూజలు, 9 గంటలకు చండీహోమం, సాయంత్రం 4 గంటలకు ఆర్జిత సేవలు, తిరిగి సాయంత్రం 6 గంటలకు కుంకుమ పూజ జరుగుతుందని తెలిపారు.