పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్టు ఒప్పందం రద్దు విషయంలో... గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను సింగిల్ జడ్జి ఎత్తివేయడాన్ని సవాలు చేస్తూ... నవయుగ సంస్థ హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ చేసింది. స్టే ఎత్తివేస్తూ గతనెల 31న జారీ చేసిన ఆదేశాల్ని రద్దు చేయాలని కోరుతూ... ఆ సంస్థ డైరెక్టర్ వై.రమేశ్ అప్పీల్ దాఖలు చేశారు. సరైన కారణం లేకుండా... అనాలోచితంగా ఒప్పందాలు రద్దు చేసిన సందర్భంలో మధ్యవర్తిత్వానికి తావున్నప్పటికీ... కోర్టు న్యాయ సమీక్ష జరపవచ్చని అప్పీల్‌లో పేర్కొన్నారు. పూర్తి వివరాల్ని పరిగణనలోకి తీసుకోకుండా ఒప్పందంలో మధ్యవర్తిత్వ నిబంధన ఉందన్న ఒక్క కారణంతో... గతంలో ఇచ్చిన స్టే ఎత్తివేయడం సరికాదన్నారు.
హైకోర్టు ధర్మాసనం ముందు నవయుగ అప్పీల్ - నవయుగ
పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్టు ఒప్పందం రద్దు విషయంలో... గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను సింగిల్ జడ్జి ఎత్తివేయడాన్ని సవాలు చేస్తూ... నవయుగ హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ చేసింది.
హైకోర్టు ధర్మాసనం ముందు నవయుగ అప్పీల్