కొత్తగా ఏర్పాటుచేసిన పశ్చిమ గోదావరి జిల్లాకు నరసాపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన నరసాపురం బంద్ విజయవంతమైంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఉదయం నుంచి బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు.
బంద్‌లో భాగంగా అఖిలపక్షం పలు వీధుల్లో నినాదాలు చేస్తూ ప్రదర్శన చేపట్టారు. నరసాపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ స్థానిక వశిష్ట గోదావరిలో అఖిలపక్ష జేఏసీ జల దీక్ష చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే నైతిక బాధ్యత వహించాలన్నారు. నరసాపురం జిల్లా రాజధాని అని చెప్పిన ఎమ్మెల్యే ప్రజలను మోసం చేశారన్నారు. జనసేన ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ప్రదర్శన చేసి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు పలు చోట్ల పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.