పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్... జానకీదేవి తనిఖీలు చేపట్టారు. అక్రమ లే అవుట్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించారు. రిజిస్ట్రేషన్లపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించి వారం రోజుల్లో సిబ్బందిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ అనారోగ్యం కారణంగా సెలవులో ఉండడటంతో సీనియర్ అసిస్టెంట్ చక్రవర్తికి ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు అప్పగించారు. అతని హయాంలోనే అక్రమ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించామని జానకీ దేవి స్పష్టం చేశారు.
రిజిస్ట్రేషన్ చేసేందుకు అధిక డబ్బు డిమాండ్ చేయటంతో పాటు... ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్‌కు డబ్బులు అడిగినట్లు ఫిర్యాదులు అందాయని వాటిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు.