ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ముఖ్యమంత్రి అపాయింట్​మెంట్ దొరకదన్న మాటల్లో నిజం లేదు' - narasapuram news

ఎంపీ రఘురామ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలపై నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ స్పందించారు. వైకాపా ఎమ్యెల్యేలు, ఎంపీలకు ముఖ్యమంత్రి జగన్ అపాయింట్​మెంట్ దొరకదని ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదన్నారు.

narsapuram-mla-madunuri-prasad
నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్

By

Published : Jun 15, 2020, 6:26 PM IST

నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి పక్క చూపులు చూడాల్సిన అవసరం లేదని.. పార్టీలో ఎలాంటి కోటరీలు లేవని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం శాసన సభ్యుడు ముదునూరి ప్రసాద్ రాజు చెప్పారు. నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.

వైకాపా ఎమ్యెల్యేలు, ఎంపీలకు జగన్ మోహన్ రెడ్డి అపాంయిట్​మెంట్ దొరకదని రఘురామకృష్ణరాజు చేసిన విమర్శల్లో ఎలాంటి వాస్తవాలు లేవన్నారు. ఆయన మీడియా ముందు అలా మాట్లాడాల్సిన అవసరం లేదని.. ఏదైనా ఉంటే.. సీఎంను వ్యక్తిగతంగా కలసి తెలియజేయాలని చెప్పారు. ముఖ్యమంత్రి చలువ వల్లే రఘురామకృష్ణంరాజు ఎంపీ కాగలిగారని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details