ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫిర్యాదుపై పోలీసులు స్పందించడం లేదు: రఘురామకృష్ణరాజు - నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వార్తలు

తన ప్రతిష్టను దిగజార్చడానికే వైకాపా నాయకులు దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారని...వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తన పీఎస్​ చేత పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ఫిర్యాదు చేసి రెండు రోజులైనా పోలీసులు స్పందించడం లేదని ఎంపీ అంటున్నారు.

narasapuram Mp Raju Complaint
ఎంపీ రఘురామకృష్ణరాజు

By

Published : Jun 19, 2020, 4:56 PM IST

తన దిష్టిబొమ్మ దగ్దం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఆచంట, పెనుగొండ, తాడేపల్లిగూడెం పోలీస్టేషన్లలో తన పీఎస్ చేత ఎంపీ ఫిర్యాదు చేయించారు. ఆయా ప్రాంతాల్లో తన దిష్టిబొమ్మను దగ్దం చేయడమే కాకుండా తీవ్ర పదజాలంతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోలీసులు కావాలనే స్పందించట్లేదు..

వైకాపా నాయకులు తన ప్రతిష్టను దిగజార్చడానికి దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారని...ఫిర్యాదులో ఆయా వ్యక్తుల పేర్లను పొందుపరిచారు. పోలీసులకు ఫిర్యాదు చేసి రెండురోజులైనా ఎవరూ స్పందించలేదన్నారు రఘురామకృష్ణరాజు. అన్ని ఆధారాలు ఉన్నా.. ఎలాంటి కేసు నమోదు చేయలేదని.. పోలీసులు కావాలనే తన ఫిర్యాదుపై స్పందించడం లేదన్నారు.

ఇవీ చదవండి:'కేసులున్న వారికా...? లేని వారికా..? వైకాపా ఎమ్మెల్యేలే నిర్ణయించుకోండి?'

ABOUT THE AUTHOR

...view details