కరోనా వైరస్ వ్యాప్తిని ఎదుర్కోవడానికి నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్‌రాజు పేర్కొన్నారు. నరసాపురం మండలం పసలదీవి, చామకూరిపాలెం గ్రామాలలో పర్యటించిన ఆయన... ఆయా గ్రామాల్లోని అధికారులు, సచివాలయ సిబ్బందికి పలు సూచనలు చేశారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా ఈ గ్రామాలకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
నరసాపురంలో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే ప్రసాద్‌రాజు - narasapuram news updates
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలో స్థానిక ఎమ్మెల్యే ప్రసాద్‌రాజు పర్యటించారు. అధికారులు, వార్డు వాలంటీర్లకు కరోనా నివారణ చర్యలపై పలు సూచనలు చేశారు.
![నరసాపురంలో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే ప్రసాద్‌రాజు narasapuram mla tour in narasapuram mandal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6949946-177-6949946-1587922363093.jpg)
నరసాపురంలో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే ప్రసాద్‌రాజు