పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి నాగరాజ వర ప్రసాద్ రాజు (ప్రసాద్‌రాజు)ను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చీఫ్‌విప్‌గా నియమించింది. ప్రస్తుతం రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి చీఫ్ విప్‌గా ఉన్నారు. ఆయన స్థానంలో ప్రసాద్‌రాజును నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులోని ‘సారాంశం (అబ్‌స్ట్రాక్ట్)’లో ఆయన్ను చీఫ్ విప్‌గా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే నోటిఫికేషన్ భాగంలో మాత్రం ‘‘విప్’’గా నియమిస్తున్నట్లు పేర్కొనడం గమనార్హం. ఆయన్ను చీఫ్ విప్‌గానే నియమించారని వైకాపా వర్గాలు తెలిపాయి.
ప్రభుత్వ చీఫ్ విప్‌గా నరసాపురం ఎమ్మెల్యే - ప్రభుత్వ చీఫ్ విప్‌గా ముదునూరి ప్రసాద్‌రాజు
ప్రభుత్వ చీఫ్ విప్‌గా నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్‌రాజును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి చీఫ్ విప్‌గా ఉన్నారు. ఆయన స్థానంలో ప్రసాద్‌రాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
![ప్రభుత్వ చీఫ్ విప్‌గా నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్‌రాజు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15003763-857-15003763-1649809627935.jpg)
ముదునూరి ప్రసాద్‌రాజు
TAGGED:
Chief Whip Prasad Raju