పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో రహదారులపై ఆకలి కేకలతో అలమటిస్తున్న గోవులకు.. పట్టణానికి చెందిన బంగారం వ్యాపారి వర్ధమాన రమేష్ జైన్... నిత్యం దాణా, పుచ్చకాయలు, కూరగాయలను ఆహారంగా పెడుతున్నారు. సుమారు 40 గోవుల ఆలనాపాలనా చూస్తున్నారు. లాక్డౌన్ ముగిసే వరకూ వాటి ఆకలి తీర్చేలా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నామని రమేష్ తెలిపారు. వీటితో పాటు కొంత మంది పేదలకు ఆహారం అందజేస్తున్నట్టు చెప్పారు.
గోవుల ఆకలి తీరుస్తున్న బంగారం వ్యాపారి - గోవులకు ఆహారం అందిస్తున్న నరసాపురం బంగారం వ్యాపారి
నరసాపురంలో ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న గోవులకు... పట్టణానికి చెందిన బంగారం వ్యాపారి అండగా నిలిచారు. లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు వీటికి ఆహారం అందిస్తానని తెలిపారు.

గోవుల ఆకలి తీరుస్తున్న నరసాపురం బంగారం వ్యాపారి