పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నారా లోకేశ్ పర్యటించారు. బాధితులను పరామర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవినీతిలో మునిగిన ముఖ్యమంత్రి నష్టాల్లో కూరుకుపోయిన రైతులను ఆదుకునే స్థితిలో లేరని అన్నారు. గతంలో సీఎం రైతు రాజ్యం తీసుకొస్తానన్నారు. ఈ రోజు రాష్ట్రంలో రైతే లేని పరిస్థితి ఏర్పడేలా ఉందన్నారు. రబీ, ఖరీఫ్ పంటలకు గిట్టుబాటు ధరను ప్రకటిస్తామన్న జగన్ ఆ దిశగా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
వైకాపా పాలనలో రైతులు అడుగడుగునా మోసాలు, అవమానాలు ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాలు, వరదల కారణంగా పంటనష్టం, కొన్ని ప్రాంతాల్లో ఊర్లు మునిగిపోయాయి. అయినా మంత్రులు గానీ, సీఎం కానీ క్షేత్రస్థాయిలో పర్యటించలేదు. ప్రభుత్వం రైతుల క్షేమాన్ని పట్టించుకోవట్లేదు
-తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్