తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా కారాగారంలో ఉన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పరామర్శించారు. ఆయన యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలనీ.. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కారాగారం వద్దకు చేరుకున్న లోకేశ్‌కు తెదేపా నాయకులు, కార్యకర్తలు సాదరంగా ఆహ్వానం పలికారు.
'భయపడొద్దు.. మేమున్నాం' చింతమనేనికి లోకేశ్ భరోసా - ఏలూరు జైలులో చింతమనేనిని కలిసిన లోకేశ్
పలు కేసుల్లో ఏలూరు కారాగారంలో రిమాండ్‌లో ఉన్న తెదేపా నేత చింతమనేని ప్రభాకర్‌ను.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించారు. అధైర్యపడొద్దనీ.. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
!['భయపడొద్దు.. మేమున్నాం' చింతమనేనికి లోకేశ్ భరోసా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4917924-588-4917924-1572509771207.jpg)
ఏలూరు జైల్లో చింతమనేనిని కలిసిన నారా లోకేశ్
ఏలూరు జైల్లో చింతమనేనిని కలిసిన నారా లోకేశ్
TAGGED:
నారా లోకేశ్ తాజా వార్తలు