సైన్స్ హబ్‌గా నన్నయ్య విశ్వవిద్యాలయం!
నన్నయ్య విశ్వవిద్యాలయంలో నూతన పీజీ కోర్సులను ప్రవేశపెట్టారు వర్సిటీ అధికారులు. కోట్లాది రూపాయలతో మౌలిక సదుపాయలు కల్పించనున్నారు.
nannaya-university
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నన్నయ్య విశ్వ విద్యాలయాన్ని సైన్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా నూతన పీజీ కోర్సులను ప్రవేశపెట్టారు. నాలుగు కోర్సులతో కూడిన ఇంజినీరింగ్ విద్యను కూడా అందించాలని యోచిస్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. వచ్చే ఏడాదికి వర్సిటీ ప్రాంగణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే యోచనలో అధికారులున్నారు.