పశ్చిమగోదావరిజిల్లా ఏలూరులో నక్కా ఆనంద్ బాబు రిమాండ్ లో ఉన్న తెదేపా నాయకుడు చింతమనేని ప్రభాకర్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్పీ స్థాయి వ్యక్తులు సైతం వ్యక్తిగతంగా తీసుకుని తెదేపా కార్వాకర్తలపై కేసులు నమోదు చేయించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఎన్నికేసులు పెట్టిన చింతమనేని ధైర్యం మిగిలిన నాయకులకు ఆదర్శంగా ఉంటుందన్నారు. వైకాపా అక్రమ కేసులకు తెదేపా కార్యకర్తలు భయపడరని వ్యాఖ్యానించారు.
ఎన్నికేసులు పెట్టినా భయపడేదిలేదు:నక్కా ఆనందబాబు
తెదేపా కార్యాకర్తలు, సానుభూతిపరులపై వైకాపా ప్రభుత్వం కక్షకట్టి పోలీసు కేసులు నమోదు పెట్టిస్తుందని మాజీమంత్రి, తెదేపా నాయకుడు నక్కాఆనంద్ బాబు ఏలూరులో అన్నారు.
ఎన్నికేసులు పెట్టినా భయపడేదిలేదు