పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జనసేన నేత నాగబాబు పర్యటించారు. కార్యకర్తలను కలిసి పార్టీ విషయాలపై చర్చించారు. పార్టీ నేతలు, కార్యకర్తలను ఇకపై ప్రతి నెలా కలుసుకుంటానని తెలిపారు. జనసేన శ్రేణులను వైకాపా నేతలు వేధిస్తున్నారని, అలా చేస్తే సహించేది లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లోనూ అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని.. స్థానిక ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పని తీరుపై తాము స్పందించమన్న నాగబాబు.. ప్రజలకు న్యాయం చేయకపోతే అడుగుతామని.. ఒత్తిడి కూడా తీసుకువస్తామని తెలిపారు.
కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదు: నాగబాబు - nagababu
అసెంబ్లీ ఎన్నికలైనా...స్థానిక ఎన్నికల్లోనైనా...జనసేన ఒంటరి పోరాటమే చేస్తుందని.. అలాగే ప్రజలకు మంచి చేయడమే తమ పార్టీ థ్యేయమని జనసేన నేత నాగబాబు అన్నారు. తమ కార్యకర్తలను వేధిస్తే మాత్రం సహించబోమని తెలిపారు.
'వైకాపా వేధిస్తే సహించేది లేదు