ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వచ్చే ఎన్నికల్లో... భాజపా-జనసేన కూటమిదే అధికారం' - బీజేపీ జనసేన కూటమిపై నాగబాబు కామెంట్స్

రాష్ట్రంలో భాజపా-జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జనసేన నేత నాగబాబు పేర్కొన్నారు. భాజపా-జనసేన పార్టీలు ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాయని వివరించారు. రాష్ట్రాభివృద్ధి కోసం భాజపాతో కలిసి పనిచేయాలని పవన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించారు.

nagababu comments on bjp janasena coalition
జనసేన నేత, సినీనటుడు నాగబాబు

By

Published : Jan 30, 2020, 7:13 PM IST

'వచ్చే ఎన్నికల్లో... భాజపా-జనసేన కూటమిదే అధికారం'

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జనసేన నేత నాగబాబు పర్యటించారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన ఆయన... అభిమానులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. త్వరలోనే భాజపా-జనసేన కూటమి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భాజపా-జనసేన భావసారూప్యత గల పార్టీలని వివరించారు. వైకాపా ప్రభుత్వం ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో... వారికే తెలియడం లేదని విమర్శించారు. వైకాపా ప్రభుత్వ నిర్ణయాలు అసంబద్ధంగా ఉంటున్నాయన్నారు. ఏ క్షణం ఏది రద్దుచేస్తారో... వారికే తెలియడంలేదని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి :జనసేనకు లక్ష్మీనారాయణ రాజీనామా

ABOUT THE AUTHOR

...view details