ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాడు - నేడు.. 1101 పాఠశాలల ముస్తాబుకు పడిన మరో అడుగు! - second phase nadu-nedu works latest news

నాడు - నేడు పథకం కింద రెండో దశలో పనులు చేయటానికి ప్రభుత్వ పాఠశాలలు, వివిధ విద్యా సంస్థలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆయా పనులు చేపట్టేందుకు.. సర్కార్ పరిపాలనా ఆమోదాన్ని ఇచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలో రెండో దశలో 1101 పాఠశాలలు, విద్యా సంస్థల్లో పనులు చేసేందుకు ఎంపిక చేసింది.

second phase nadu-nedu works
నాడు-నేడు పనులు

By

Published : Apr 19, 2021, 10:54 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం... మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని 2019 నవంబర్ నెలలో ప్రారంభించింది. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాడు - నేడు పనులను.. 2019 -20 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించారు. కరోనా కారణంతో మొదటి దశ నాడు నేడు పనుల్లో జాప్యం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటి దశలో 1117 ప్రభుత్వ పాఠశాలల.. చేపట్టిన అభివృద్ధి పనులు చివరి దశలో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా రెండో దశ పనులను ఈ విద్యా సంస్థల్లో ప్రారంభించనున్నారు.

విద్యా సంస్థ సంఖ్య
ప్రాథమిక పాఠశాలు 662
ప్రాథమికోన్నత పాఠశాలలు 41
ఉన్నత పాఠశాలలు 170
సెకండరీ పాఠశాలలు 3
మండల రిసోర్స్ కేంద్రాలు 46
సీడబ్ల్యూఎస్ఎన్​లు 33
బీసీ వసతి గృహాలు 22
డైట్ కళాశాలలు 2
దివ్యాంగుల క్యాటగిరీలు 2
ఈఎన్ఆర్ఎస్​లు 1
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 29
గురుకుల జూనియర్ కళాశాలలు 3

చేపట్టబోయే అభివృద్ధి పనులు:

  • నీటి వసతితో కూడిన మరుగుదొడ్లు
  • తాగు నీటి సరఫరా మరమ్మతులు
  • విద్యుదీకరణ
  • ఫ్యాన్లు
  • డిజిటల్ విధానంతో కూడిన స్మార్ట్ టీవీల అమర్చటం
  • ఆంగ్ల ల్యాబ్
  • వంట శాల ప్రహారీ గోడలు

కమిటీల నియామకం

రెండో దశ నాడు-నేడు పనుల నిర్వహణ, పర్యవేక్షణకు... జిల్లా, మండల స్థాయిలో కమిటీని నియమించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పనులు నిర్వహణ బాధ్యతలను ఈ కమిటీ నిర్వహిస్తాయి. వీటితో పాటు పాఠశాలల స్థాయిలో తల్లిదండ్రుల కమిటీలు, కళాశాల స్థాయిలో అభివృద్ధి కమిటీల సంబంధంతో... పాఠశాలలు కళాశాలల వారీగా అభివృద్ధి పనులు చేస్తారు.

మార్గదర్శకాలకు అనుగుణంగా పనులు

రెండో దశలో నాడు-నేడు పనులను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా.. చేపట్టామని జిల్లా విద్యాశాఖ అధికారి సీవీ రేణుక తెలిపారు. చేపట్టబోయే పనులకు అంచనాలు రూపొందించి జిల్లా ఉన్నతాధికారుల ఆమోదంతో పాటు.. ఇతర ప్రక్రియలు నిర్వహించాల్సి ఉందన్నారు. రెండో దశ నాడు-నేడు పనులను క్రమపద్ధతిలో నిర్ణీత సమయం కంటే ముందుగానే పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని డీఈవో వివరించారు.

ఇదీ చదవండి:

'జీవనదులున్నా దొరకని నీరు.. పట్టించుకోని అధికారులు'

ABOUT THE AUTHOR

...view details