ఏలూరు వింత వ్యాధి బాధితులను నాదెండ్ల మనోహర్ పరామర్శించి.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రెండు వారాలు గడిచినా.. వింతవ్యాధి కారణాలను ప్రభుత్వం ఎందుకు నిర్ధారించలేకపోయిందని ప్రశ్నించారు. వివిధ జాతీయ సంస్థలు అందించిన నివేదికలు ఎందుకు బయటపెట్టలేదని అన్నారు. ఏలూరులో బాధితులు ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్నారని వారికి అవసరమైన వైద్యాన్ని అందించి.. కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
'వింతవ్యాధి కారణాలను ప్రభుత్వం ఎందుకు నిర్ధారించలేకపోయింది'
ఏలూరు వింతవ్యాధిపై 21 మందితో రాష్ట్రస్థాయి కమిటీ వేసి.. రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింతవ్యాధి బారిన పడిన వారిని ఆయన పరామమర్శించారు.
nadendla manohar on eluru mystery disease