ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పేద పిల్లలు విద్యావంతులుగా ఎదగాలనేదే లక్ష్యం' - తణుకులో నాడు నేడు కార్యక్రమం

తణుకులో నాడు-నేడు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రారంభించారు. కోటి 58 లక్షల రూపాయలతో విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.

naadu nedu
naadu nedu

By

Published : Jun 7, 2020, 1:27 PM IST

ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ ‌స్థాయిలో తీర్చిదిద్దటమే లక్ష్యంగా ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమం చేపట్టిందని పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో కోటి 58 లక్షల రూపాయలతో నాడు-నేడు పనులను ఆయన ప్రారంభించారు. నియోజకవర్గంలో పాఠశాలలన్నింటినీ రెండు విడతలుగా తీర్చిదిద్దనున్నట్టు ఆయన తెలిపారు.

పేద పిల్లలు సైతం ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని, వారి కుటుంబాలు ఎదగాలనే ఆకాంక్షతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాఠశాలల అభివృద్ధిపై దృష్టి పెట్టారన్నారు. ఈనెల 8తేదీ నుంచి దేవాలయాలకు అనుమతిచ్చారని, ప్రజలందరూ నిబంధనలు పాటిస్తూ సహకరించాలని ఆయన కోరారు.

ఇదీ చదవండి:శాంతి మంత్రానికే భారత్​- చైనా మొగ్గు: ఎంఈఏ

ABOUT THE AUTHOR

...view details