ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాడె కట్టి.. శవాన్ని మోసిన ముస్లింలు! - Narsapuram

సాటి వారికి సాయం చేసేందుకు కులమతాలు అడ్డురావని నిరూపించారు ఆ నలుగురు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్నం పంజా సెంటర్​లో హిందూ వ్యక్తి మరణించగా.. పాడె కట్టి.. శ్మశానం వరకు శవాన్ని మోశారు.

Muslims Performed Hindu man final funeral
పాడె కట్టి మోసిన ముస్లింలు

By

Published : May 14, 2020, 10:23 AM IST

Updated : May 14, 2020, 5:27 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని పట్నం పంజా సెంటర్ కు చెందిన దామోదర్ రాము(48)... అనారోగ్యంతో బుధవారం మృతి చెందాడు. కిరాణా వ్యాపారిగా రాము అందరికీ సుపరిచితుడు. అతని మరణ వార్త బంధువులకు, మిత్రులకు, తోటి వ్యాపారులకు తెలిసినా.. రెడ్ జోన్ ప్రాంతం కావడం వల్ల ఎవరూ వెళ్లలేకపోయారు.

ఆ ప్రాంతంలోనే ఉండే ముస్లిం యువకులు విషయాన్ని తెలుసుకుని... రాము అంతిమ కార్యక్రమం నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. ఆయన మృతదేహానికి పాడె కట్టి శ్మశానం వరకూ హిందూ సంప్రదాయం ప్రకారమే మోసుకు వెళ్లారు. మానవత్వాన్ని చాటుకున్నారు. రాము తండ్రి తలకొరివి పెట్టి అంత్యక్రియలు పూర్తి చేశారు.

Last Updated : May 14, 2020, 5:27 PM IST

ABOUT THE AUTHOR

...view details