ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వీడిన మిస్టరీ' - friz]

ఏలూరులో సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మహిళతో వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణంగా జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ నిర్దారించారు. తమ్మిలేరు ప్రాంతంలో లభ్యమైన తల లేని మృతదేహం ఆధారంగా విచారణ చేపట్టినట్లు తెలిపారు.

ఎస్పీ రవి ప్రకాష్

By

Published : Feb 28, 2019, 1:38 PM IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరంలో సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మహిళతో వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణంగా జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ నిర్దారించారు. ఈ నెల 17 న తమ్మిలేరు ప్రాంతంలో లభ్యమైన తల లేని మృతదేహం ఆధారంగా విచారణ చేపట్టినట్లు తెలిపారు.

మృతుడు వన్​టౌన్​కు చెందిన టాక్సీ డ్రైవర్ కంచి సతీష్​గా గుర్తించారు. అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో నిందితుడు వేణు అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ... ఈ విషయంలో వారి ఇద్దరి మధ్య గొడవలు జరిగేవని పోలీసులు చెప్పారు. నిందుతుడు జనరల్ స్టోర్ నిర్వహించేవాడని చెప్పారు.

హత్య ఎలా జరిగింది.....

తనతో పదేపదే వాగ్వాదం పడుతున్న సతీష్​ను ఎలాగైనా అడ్డు తొలిగించుకునేందుకు నిందితుడు వేణు ప్రణాళిక రచించాడు. స్నేహం పేరుతో మోసం చేయాలనుకున్నాడు. పార్టీకి ఆహ్వానించి ,మద్యం తాగించి సృహ కోల్పోయేలా చేశాడు. స్నేహితుడు మురళీకృష్ణ సహాయంతో అప్పటికే సిద్ధం చేసుకుని ఉన్న ద్విచక్రవాహనంపై సతీష్​ను కోనంగి ప్రాంతానికి తీసుకెళ్లారు. కత్తితో నరికి అతని శరీరం నుంచి తల వేరు చేశారు. ఆధారాలు లభించకుండా మెండాన్ని తమ్మిళేరులో పడేసి పరారయ్యారని ఎస్పీ రవిప్రకాష్ వివరాలు వెల్లడించారు.

ఫ్రిజ్​లో పెట్టలేదు..
మృతుడి తలను ఫ్రిజ్​లో ఉంచినట్లు వస్తున్న ప్రచారాన్ని ఎస్పీ రవి ప్రకాష్ ఖండించారు. అవన్నీ వదంతులని... నమ్మవద్దని సూచించారు. మృతుడి తల దెందులూరులోని గోదావరి కెనాల్​లో లభ్యమైనట్లు స్పష్టం చేశారు.

ఎస్పీ రవి ప్రకాష్

ABOUT THE AUTHOR

...view details