పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లులో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సురేష్ అనే యువకుడు మృతి చెందగా.. రామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. కొవ్వూరు నుంచి చాగల్లుకు కారులో వస్తుండగా.. ఈ దాడి జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
మృతుడు సురేష్ స్థానికంగా ఫోటో స్టూడియో నిర్వహిస్తున్నారు. రామకృష్ణ వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నారు. గాయపడిన రామకృష్ణను కొవ్వూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.