ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తణుకులో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తణుకు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేశారు. కరోనా సమయంలో ముందుండి సేవలందించినప్పటికీ వేతనాల విషయంలో ప్రభుత్వ వైఖరి సరైంది కాదంటూ మండిపడ్డారు.

municipal workers dharna
పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

By

Published : Nov 30, 2020, 6:48 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన నిర్వహించారు. సీఐటీయూ అనుబంధ సంఘాల కార్మికుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వేతనాలు సక్రమంగా చెల్లించాలని, నాలుగునెలలుగా పెండింగులో ఉన్న హెల్త్‌ అలవెన్సు వెంటనే ఇవ్వాలని కోరారు.

ఒప్పంద కార్మికులను క్రమబద్దీకరించాలని సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న పట్టణ విస్తీర్ణానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్​ చేశారు. కార్మికులకు విధి నిర్వహణలో రక్షణ కల్పించాలని అన్నారు. జగన్​ కూడా గత సర్కారు లాగే వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details