ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికుడు మృతి... ధర్నాకు దిగిన తోటి సిబ్బంది - పశ్చిమగోదావరిలో పారిశుద్ధ్య కార్మికుడు మృతి

విధి నిర్వహణలో ఉన్న ఓ పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందటంతో... పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పురపాలక సంఘం వద్ద తోటి కార్మికులంతా కలిసి నిరసన చేపట్టారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయాలని డిమాండ్ చేశారు.

municipal workers darna at west godavari
పారిశుద్ధ్య కార్మికుడు మృతి... ధర్నాకు దిగిన తోటి కార్మికులు

By

Published : Aug 13, 2020, 6:41 PM IST

విధి నిర్వహణలో ఉన్న ఓ పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందటంతో... తోటి కార్మికులంతా కలిసి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పురపాలక సంఘం వద్ద ధర్నా చేపట్టారు. హౌసింగ్ బోర్డు కాలనీలో విధులు నిర్వహిస్తుండగా శ్రీనివాస అనే పారిశుద్ధ్య కార్మికుడు గ్యాస్ట్రిక్ నొప్పితో బాధపడుతూ దగ్గర్లో ఉన్న హోటల్ లో టిఫిన్ చేసి మందులు వేసుకున్నాడు.

కొద్ది సేపటికే శ్రీనివాస్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కార్మికుని మృతితో ఆ కుటుంబం రోడ్డున పడిపోయిందని... ఒక పాప, బాబుతో అతని భార్య ఎలా బతుకుతందని తోటి కార్మికులు నిరసన చేపట్టారు. వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని అంతా కలిసి పురపాలక కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details