పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పురపాలక ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణంలోని మున్సిపల్ ఓపెన్ థియేటర్లో ఎన్నికలకు సంబంధించిన సామగ్రిని సిబ్బందికి అందజేశారు. పోలింగ్ సిబ్బందిని వార్డులకు తరలించేందుకు ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు. పట్టణంలోని 28 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తుండగా... 52 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను పటిష్ఠం చేశారు.
నరసాపురంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి - municipal elections in narsapuram
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు. పట్టణంలో 28వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.
నరసాపురంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి