ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పశ్చిమలో పురపోరు.. చాలా హాట్ గురూ..! - today muncipal elections in west goavari news update

పురపాలక సంఘాల ఎలక్షన్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పట్టణాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థతో పాటు పురపాలక సంఘాల్లోనూ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. కొవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి. మళ్లీ ఎన్నికల సంఘం ప్రకటనతో నగరంలో 'పుర' సందడి నెలకొంది.

muncipal elections in west goavari division
పశ్చిమ గోదావరిలో వెడెక్కుతున్న రాజకీయ వాతావరణం

By

Published : Feb 16, 2021, 5:23 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థతో పాటు నిడదవోలు, కొవ్వూరు, నరసాపురం, జంగారెడ్డిగూడెం పట్టణాల్లో ఎన్నికలు జరగనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. గతేడాది మార్చి 23న ఎన్నికలు జరపడానికి ఏర్పాట్లు చేసినప్పటికీ కొవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి.

జిల్లాలో నిడదవోలు పురపాలక సంఘంలో 28 వార్డులుండగా.. 35 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 33,548 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నగరంలోని 28 వార్డులకు 175 మంది వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీటిలో రెండు నామినేషన్లు చెల్లుబాటు కాలేదు.

తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 2న నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి అవకాశం కల్పించారు. మార్చి 3 మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం సమయం ఇచ్చింది. ఛైర్మన్ పదవి జనరల్ కేటగిరీకి కేటాయించటంతో పోటీ తీవ్రంగా ఉంది. అధికార వైకాపాలోనూ ఛైర్మన్ పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉండటం మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

ఇవీ చూడండి...

ఏలూరు నగర పాలక సంస్థ సహా నాలుగు పట్టణాల్లో ఎన్నికలు

ABOUT THE AUTHOR

...view details