సినీ నటుడు రామ్ చరణ్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని మెగా అభిమానులు మృత్యుంజయ హోమం జరిపించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాజీ సర్పంచి రాంధే రాజారావు ఆధ్వర్యంలో హోమం జరిగింది. రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన రంగస్థలం చిత్రంలో చిన్న పాత్రలో నటించిన లక్ష్మి.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చరణ్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని అభిమానులు కాంక్షించారు.
రామ్చరణ్ కరోనా నుంచి కోలుకోవాలని మృత్యుంజయ హోమం - mruthyunjaya homam in chebrolu news
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని అభిమానులు మృత్యుంజయ హోమం నిర్వహించారు. చరణ్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు.
మృత్యుంజయ హోమం