పశ్చిమగోదావరి జిల్లాలో జోరందుకున్న నామినేషన్లు - zptc election naminations news in west godavari
పశ్చిమగోదావరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లు జోరందుకున్నాయి. చింతలపూడి, పోలవరం, కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో ఎంపీటీసీ స్థానాలకు ప్రధాన పార్టీలైన వైకాపా, తెదేపా అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఆఖరి రోజు నామినేషన్లు భారీగా రావొచ్చని అధికారులు చెబుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. చింతలపూడి, పోలవరం, కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ప్రధాన పార్టీలైన వైకాపా, తెదేపా అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కొన్నిచోట్ల అభ్యర్థిత్వం తేలక పోవటంతో రేపటికి నామినేషన్లు వాయిదా పడ్డాయి. ఆఖరి రోజు నామినేషన్లు భారీగా రావొచ్చని అధికారులు చెబుతున్నారు. అవకాశం లభించని ఆశావహులు మరొక పార్టీలోకి జారుకుంటున్నారు. దీంతో పలు పంచాయతీల్లో రాజకీయాల రగడ మొదలైంది. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో వైకాపా నుంచి రెబల్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు.