ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

RRR: 'రాష్ట్ర ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేస్తోంది' - MP Raghuramaraju latest updates

పెట్రోల్, డీజిల్​పై రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నులపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, రోడ్ల అభివృద్ధికి వసూలు చేసిన సెస్‌తో రాష్ట్రంలో ఎక్కడ ఒక్క గుంత కూడా పూడ్చలేదని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి గత ప్రభుత్వాలే కారణం అని వారిపై నెపం పెట్టి తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

MP Raghuramaraju
MP Raghuramaraju

By

Published : Nov 9, 2021, 3:50 AM IST

Updated : Nov 9, 2021, 1:18 PM IST

పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నులపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, రోడ్ల అభివృద్ధికి వసూలు చేసిన సెస్‌తో రాష్ట్రంలో ఎక్కడ ఒక్క గుంత కూడా పూడ్చలేదని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి గత ప్రభుత్వాలే కారణం అని వారిపై నెపం పెట్టి తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ఫ్లై ఓవర్లు, రహదారుల అభివృద్ధికి 1 లక్ష 98 వేల కోట్లు పెట్రోలియం ఉత్పత్తుల పై సెస్ రూపంలో వసూలు చేసారన్న రఘురామ... కేంద్ర ప్రభుత్వం రేట్లు పెంచినప్పుడల్లా రాష్ట్రానికి ఆదాయం వస్తే… ఇప్పుడు తగ్గించమని కోరితే కేంద్రంపై ఎదురుదాడి చేస్తున్నారని దుయ్యబట్టారు.

లీటర్ పెట్రోల్ పై 15 రూపాయలు పన్ను రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తోందన్న ఎంపీ... కేంద్ర ప్రభుత్వం పెంపు నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చిందో ఆర్ధిక మంత్రి బుగ్గన సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడు రేట్లు పెంచుతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.

భవిష్యత్ లో రాష్ట్రం ఆర్ధికంగా దివాలా తీస్తే ఆ నెపాన్ని కూడా కేంద్రంపై నెట్టి బలిపశువు చేసే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పై అబద్ధాలు ప్రచారం చేస్తూ పత్రికా ప్రకటనలు ఇవ్వడం రాజద్రోహం కాదా? అని ప్రశ్నించారు. ఏపీ పక్క రాష్ట్రాల్లో చమురు ధరలు తక్కువ కాబట్టి.. ఏపీ వాహనదారులు పక్క రాష్ట్రంలో కొనుగోలు చేయడం నేరమని చట్టం తెస్తారేమో! అని ఎద్దేవా చేశారు. అమరావతి పాదయాత్రకు ఉద్దేశ పూర్వకంగా అడ్డంకులు సృష్టించవద్దని పోలీసులను, ప్రభుత్వాన్ని రఘురామరాజు కోరారు.

ఇదీ చదవండి:

ఆ గ్రామంలో ఉబికి వస్తున్న నీటి ఊట.. ఎందుకంటే..

Last Updated : Nov 9, 2021, 1:18 PM IST

ABOUT THE AUTHOR

...view details