ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నాకు ప్రాణహాని ఉంది..కేంద్ర భద్రతా సిబ్బందితో రక్షణ కల్పించండి' - జగన్​పై ఎంపీ రఘురామకృష్ణరాజు కామెంట్స్

రఘురామకృష్ణరాజు
రఘురామకృష్ణరాజు

By

Published : Jun 21, 2020, 4:20 PM IST

Updated : Jun 21, 2020, 9:03 PM IST

16:19 June 21

తనకు ప్రాణహాని ఉందని లోక్‌సభ స్పీకర్​తోపాటు ప్రధాని, హోంమంత్రికి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖలు రాశారు. కేంద్ర భద్రతా సిబ్బందితో రక్షణ కల్పించాలని లేఖలో కోరారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపినందుకు దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

శ్రీవారి భూముల అమ్మకం అంశంలో ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నించానని.. అవకాశం లేకపోవడంతో తన అభిప్రాయాన్ని మీడియా ద్వారా చెప్పానని రఘురామకృష్ణరాజు లేఖలో పేర్కొన్నారు. అప్పట్నుంచి తన నియోజకవర్గంలో పలువురు నేతలు అలజడి సృష్టిస్తున్నారని స్పీకర్‌కు తెలిపారు. కోట్లమంది భక్తుల మనోభావాలను కాపాడే ప్రయత్నం చేశానని రఘురామకృష్ణరాజు అన్నారు.

ప్రధాని, హోంమంత్రికీ లేఖలు

లోక్​సభ స్పీకర్​తో పాటు ప్రధాని, హోంమంత్రికి రఘురామకృష్ణరాజు లేఖలు రాశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొన్నారు. తనకు భద్రత కల్పించాలని మోదీ, అమిత్‌షాను కోరారు.

స్వామివారి భక్తుడిగా తనలాంటివారు కోరుకున్న విషయాన్ని మీడియాతో చెప్పా... బహిరంగంగా చెప్పినందుకు వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు. ఇసుక వ్యవహారంలో ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపాను. సామాన్యులకు న్యాయం చేయాలని కోరితే ఎమ్మెల్యేలతో విమర్శలు చేయిస్తున్నారు. నియోజకవర్గంలోకి అడుగుపెట్టనివ్వమని బెదిరిస్తున్నారు. నా వ్యక్తిగత కార్యదర్శి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా... ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డబ్బు ఇచ్చిన వారికే ఇంటి స్థలాలు ఇస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఈ విషయం ముఖ్యమంత్రికి చెప్పేందుకు ప్రయత్నించినా స్పందన లేదు. ఇసుక, ఇంటిస్థలాలపై డబ్బు వసూలు చేస్తున్నారన్నందుకు నాపై కక్ష కట్టారు. నాకు కేంద్ర భద్రతా సిబ్బందితో రక్షణ కల్పించండి. 

                                                                               -ఎంపీ రఘురామకృష్ణరాజు

ఇదీ చదవండి: 'వైకాపా ఎమ్మెల్యేలతో రఘురామకృష్ణరాజుకు ప్రాణహాని ఉంది'

Last Updated : Jun 21, 2020, 9:03 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details