ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MP RRR : ఎంపీ రఘురామ భీమవరం పర్యటన రద్దు.. కారణం అదేనా..! - ఎంపీ రఘురామ భీమవరం పర్యటన రద్దు

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు భీమవరం పర్యటన రద్దు చేసుకున్నారు. రైలులో నర్సాపురం బయల్దేరిన రఘురామ.. బేగంపేట స్టేషన్​లో దిగి హైదరాబాద్​లోని తన ఇంటికి వెళ్లిపోయారు.

MP RRR
MP RRR

By

Published : Jul 4, 2022, 2:31 AM IST

అల్లూరి విగ్రహావిష్కరణ సందర్భంగా భీమవరం రావాల్సి ఉన్న తాను పర్యటనను రద్దు చేసుకున్నట్లు వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. భీమవరంలో ఉన్న తన అనుచరులతో పాటు మరికొందరిని స్థానిక పోలీసులు బైండోవర్ల పేరిట స్టేషన్‌కు తీసుకెళ్లి తీవ్రంగా హింసించారని రఘురామ ఆరోపించారు. తర్వాత పిల్లల తల్లిదండ్రులతో తనకు ఫోన్‌ చేయించి తాను కార్యక్రమానికి రాకుండా ఉంటే వాళ్లని వదిలేస్తామని చెప్పారని...రఘురామ తెలిపారు. అందువల్ల తాను బేగంపేట స్టేషన్‌లో దిగిపోతున్నట్లు చెప్పిన ఎంపీ.....పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు స్పష్టంచేశారు. అనంతరం హైదరాబాద్‌లోని తన ఇంటికి రఘురామకృష్ణరాజు వెళ్లిపోయారు.

సోమవారం భీమవరంలో జరిగే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో తాను పాల్గొంటానని ఎంపీ రఘురామరాజు గతంలోప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details