ఎంపీ రఘురామ అభిమానుల బైక్ ర్యాలీ.. కారణమా అదేనా..! - ఎంపీ రఘురామ అభిమానుల బైక్ ర్యాలీ
రెండేళ్ల తరువాత రాష్ట్రానికి ఎంపీ రఘురామకృష్ణరాజు రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. సోమవారం భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎంపీ రఘురామ పాల్గొననున్నారు.

బైక్ ర్యాలీ
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆదివారం భీమవరం రానున్నారు. సుమారు రెండేళ్ల తర్వాత భీమవరం రానున్న నేపథ్యంలో ఆయన అభిమానులు ట్రిపుల్ ఆర్ జిందాబాద్ అంటూ బైక్ ర్యాలీ నిర్వహించారు. రఘురామ సొంత నియోజకవర్గంలో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకానున్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం తనను అరెస్టు చేయకుండా రఘురామకృష్ణరాజు హైకోర్టు నుంచి ముందస్తు అనుమతి పొందారు.
ఎంపీ రఘురామ అభిమానుల బైక్ ర్యాలీ.. కారణమా అదేనా..!
Last Updated : Jul 3, 2022, 6:14 AM IST