RRR comments on his resignation: త్వరలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తా: రఘురామ - ysrcp mp
12:12 January 07
RRR comments on his resignation: రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్తా: రఘురామ
RRR comments on his resignation: త్వరలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రకటించారు. తనపై అనర్హత వేటు వేయించాలని చూస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలించేందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతి కొనసాగింపునకే ఈ నిర్ణయమని రఘురామ వ్యాఖ్యానించారు.
'అనర్హత వేటు వేయించేందుకు సమయం ఇస్తున్నా. అనర్హత వేటు వేయకపోతే నేనే రాజీనామా చేస్తా. నేను రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్తా. వైకాపాపై ఎంత వ్యతిరేకత ఉందో ఎన్నికల ద్వారా తెలియజేస్తా. పార్టీ నుంచి తొలగించాలని యత్నించినా సాధ్యం కాలేదు.' - వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు