సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అనడం దారుణమని నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ముఖ్యమంత్రి ఏ ప్రాంతంలో ఉంటే అదే రాజధాని అవుతుందని.. రాజ్యాంగంలో రాజధాని ప్రస్తావనే లేదని మంత్రి గౌతమ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రఘురామ కృష్ణరాజు స్పందించారు.
RRR: 'సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అనడం దారుణం'
జగన్ ప్రభుత్వంలో మంత్రులకు ప్రాధాన్యం లేదా అని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు నిలదీశారు. సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అనడం దారుణమని అన్నారు.
MP raghu rama raju
‘‘మంత్రులు, ఉన్నతాధికారులు ఉండే రాజధానికి విలువ లేదా? జగన్ ప్రభుత్వంలో మంత్రులకు ప్రాధాన్యం లేదా? సీపీఎస్ గురించి గతంలో సీఎం జగన్ చెప్పిన దాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పారు. హామీ ప్రకారం ఉద్యోగులకు ఇళ్లు కట్టించి ఇస్తారని భావిస్తున్నా’’ -రఘురామరాజు, వైకాపా ఎంపీ
ఇదీ చదవండి: