ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ - వైకాపా ఎంపీ రఘరామకృష్ణ రాజు తాజా వార్తలు

లోక్​సభ స్పీకర్ ఓం బిర్లాకు వైకాపా ఎంపీ రఘరామకృష్ణరాజు లేఖ రాశారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో ప్రతిష్టించాలని విన్నవించారు. విగ్రహం కూడా సిద్ధంగా ఉందని వెల్లడించారు.

mp raghu rama krishna raju letter to lok sabha speaker
mp raghu rama krishna raju letter to lok sabha speaker

By

Published : Jul 4, 2020, 7:51 PM IST

అల్లూరి సీతారామరాజు 122 జయంతిని పురస్కరించుకుని ఆయన కాంస్య విగ్రహాన్ని పార్లమెంటు ఆవరణలో ప్రతిష్టించాలని కోరుతూ లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లాకు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు.

'ఆంధ్రపదేశ్​తో పాటు ఒడిశా, ఛత్తీస్​గఢ్​లోని గిరిజనులకు, తెలుగు వారందరికీ అల్లూరి సీతారామరాజు ఆరాధ్య దైవం. అల్లూరి విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేయడం వారందరి ఆకాంక్ష. పార్లమెంటు ప్రమాణాలకు అనుగుణంగా విగ్రహం కూడా సిద్ధంగా ఉంది. దీనిని తక్షణమే లోక్​సభ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలి' అని రఘరామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details