ఎంపీ నియోజకవర్గ పరిధి ఎమ్మెల్యేలకంటే ఆయనకు తక్కువ ఓట్లే వచ్చాయి. అలాంటిది ఆయన అక్కడి ఎమ్మెల్యేలను గెలిపించడమేంటి? ఎంపీ అంత గొప్ప వ్యక్తి అయితే సొంత పార్టీ పెట్టుకోవచ్చుగా? మమ్మల్ని గెలిపించిన జగన్ పట్ల ఎల్లప్పుడూ విశ్వాసంతో ఉంటాం. - మంత్రి పేర్ని నాని
రఘురామకృష్ణరాజు స్పందన: మనం ఒకసారి కలసినపుడు మీరేమన్నారో గుర్తుకు తెచ్చుకోండి నాని. సరే నా ఖర్మో.. మీ ఖర్మో నేను పార్టీలోకి వచ్చా. ఏ మూలనో మా రాజశేఖరరెడ్డి అబ్బాయి జగన్ అనే గౌరవంతో వీళ్లంతా కబురుపెడితే పెద్ద వాళ్లతోనే మాట్లాడా. గౌరవం ఇచ్చి పుచ్చుకోండి.
జగన్ అపాయింట్‌మెంట్ ఇప్పించండని బతిమిలాడారు. జగన్‌తో చెబితే ససేమిరా అన్నారు. ఆయన్ని మేమే ఒప్పించాం. - ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు
రఘురామకృష్ణరాజు:కారుమూరి నాగేశ్వరరావును బతిమిలాడానట. ఇళ్ల స్థలాల అక్రమాలలో ఆయనపై 60, 70 ఫిర్యాదులున్నాయి. వీరా మాట్లాడేది?
ఎంపీకి తన స్వగ్రామంలోనే తక్కువ ఓట్లొచ్చాయి. కులాల మధ్య చిచ్చుపెట్టే పనులు మానుకోవాలి.- మంత్రి శ్రీరంగనాథరాజు
రఘురామకృష్ణరాజు:అసలు నిందితుడు మంత్రి శ్రీరంగనాథరాజే. వాళ్ల ఊళ్లో చేసే అవినీతి అందరికీ తెలుసు.
గతంలోనే ఎంపీ వ్యవహార శైలి నచ్చక ప్రజలు బహిష్కరించారు. మూడు పార్టీలు మారిన ఆయన గురించి ప్రజలందరికీ తెలుసు.- ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్