ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజకీయాలను నేరమయం చేశారు..: పిల్లి సుభాష్​చంద్రబోస్​ - local body elections latest news

రాజకీయాలను నేరమయం చేశారని, క్రిమినల్స్ కు రాజకీయాలు బాగా పనికొస్తాయని ఎంపీ పిల్లి సుభాష్​చంద్రబోస్​ అన్నారు. రాజకీయాలు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయని ఆయన అన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండి నేతలను ఎన్నుకోవాలన్నారు.

mp pilli subash comments on current politics
ఎంపీ పిల్లి సుభాష్

By

Published : Nov 17, 2020, 7:57 AM IST

Updated : Nov 17, 2020, 8:29 AM IST

రాజకీయాలను నేరమయం చేశారు..: పిల్లి సుభాష్​చంద్రబోస్​

వైకాపా రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తాజా రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలను నేరమయం చేశారని, నేర చరిత్ర ఉన్న వారికి రాజకీయాలు బాగా పనికొస్తాయన్నారు. ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు’ పాదయాత్ర ముగింపు సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు కూడలిలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అక్రమ సంపాదనకు రాజకీయాలే మార్గంగా కొందరు చేసుకున్నారని, రాజకీయాలు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయని అన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండి మంచి రాజకీయ నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు.

రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయని పిల్లి సుభాష్‌ చంద్ర బోస్‌ చెప్పారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే తమ పాలన ప్రజామోదంగా ఉందో లేదో తేలుస్తాయని చెప్పారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా పేదలకు అందుతున్నాయో లేదో తెలుసుకుని వారి సూచనలు, సలహాలు తీసుకోవాలన్నదే పాదయాత్ర ప్రధాన ఉద్దేశమన్నారు.

Last Updated : Nov 17, 2020, 8:29 AM IST

ABOUT THE AUTHOR

...view details