ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చెేపట్టిన తర్వాత రాష్ట్రంలో మహిళల అభివృద్దికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో రూ.కోటి 75 లక్షలతో చేపట్టిన అభివృద్ది పనులకు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత జగన్‌కే దక్కుతుందని అన్నారు.
'బడుగు బలహీన వర్గాల అభివృద్దికి సీఎం ఎనలేని కృషి చేస్తున్నారు' - పశ్చిమగోదావరి జిల్లా తాజా వార్తలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ శంకుస్థాపన చేశారు. బడుగు బలహీన వర్గాల వారికి చేయూతనివ్వడానికి ముఖ్యమంత్రి వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు.
శంకుస్థాపన చేస్తున్న ఎంపీలు
ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 70 శాతానికి పైగా పేద బడుగు బలహీన వర్గాల వారు ఉన్నారని... వారికి చేయూతనివ్వడానికి ముఖ్యమంత్రి వివిధ రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ్‌రాజు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: