ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Kapu Reservations: రాష్ట్రంలో కాపులకు రిజర్వేషన్‌ అమలు చేయాలి: ఎంపీ జీవీఎల్ - రాష్ట్రంలో కాపులకు రిజర్వేషన్‌ అమలు చేయాలి

MP GVL On Kapu Reservations: రాష్ట్రంలో కాపులకు రిజర్వేషన్‌ అమలు చేయాలని భాజపా ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు డిమాండ్‌ చేశారు. కాపు రిజర్వేషన్ కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడంలేదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్యను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.

రాష్ట్రంలో కాపులకు రిజర్వేషన్‌ అమలు చేయాలి
రాష్ట్రంలో కాపులకు రిజర్వేషన్‌ అమలు చేయాలి

By

Published : Feb 13, 2022, 5:47 PM IST

MP GVL On Kapu Reservations: మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్యను.. భాజపా ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్యసభలో కాపు రిజర్వేషన్‌పై ప్రస్తావించిన నర్సింహారావుకు హరిరామజోగయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాపు రిజర్వేషన్ అమలు చేసిన మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం ఎంపీ నర్సింహారావు మాట్లాడుతూ... కాపు రిజర్వేషన్ కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడంలేదన్నారు. వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని కేంద్రానికి సంబంధం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

కేంద్రం ఇచ్చే నిధుల్లో ఏపీ తన వాటా చెల్లించటం లేదు..
వివిధ పథకాలకు సంబంధించి కేంద్రం ఇచ్చే నిధుల్లో ఏపీ తన వాటా చెల్లించటం లేదని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. ఈ కారణంగా నిధుల విడుదల ఆగిపోతుందన్నారు. పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. వైకాపా ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని జీవీఎల్‌ హితవు పలికారు. కేంద్ర బడ్జెట్‌కు సంబంధించి రాజమహేంద్రవరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఇదీ చదవండి :
ఆ విషయంలో వైకాపాకు మద్దతిస్తాం: తెదేపా ఎంపీ కనకమేడల

ABOUT THE AUTHOR

...view details