రహదారి నిర్మాణానికి ఎంపీ భరత్ శంకుస్థాపన - mp bharat road works opening in west godawari
పశ్చిమగోదావరి జిల్లాలో నిర్మించ తలపెట్టిన తల్లాడ - దేవరపల్లి జాతీయ రహదారి పనులకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావుతో కలిసి ఎంపీ మార్గాని భరత్ శంకుస్థాపన చేశారు. రహదారుల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని భరత్ తెలిపారు.

రహదారి నిర్మాణానికి ఎంపీ భరత్ శంకుస్థాపన
రహదారుల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురంలో రూ.95.50 కోట్లతో నిర్మించనున్న తల్లాడ- దేవరపల్లి జాతీయ రహదారి పనులకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. గత ఐదేళ్లుగా జాతీయ రహదారి పూర్తిగా పాడైందని ఎంపీ భరత్ వ్యాఖ్యానించారు. ప్రజల సౌకర్యం కోసం రాహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు.