అవినీతి ఆరోపణలతో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ మృత్యుంజయరావు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు రవాణాశాఖ కమిషనర్ సీతా రామాంజనేయులు ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లి గూడెం బైపాస్ రహదారిపై నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలకు ఛలానాలు రాయకుండా, కేసులు నమోదు చేయకుండా లంచం తీసుకుని వదిలేశారని ఆయనపై వేటు పడింది.
వచ్చీపోయే చోదకుల నుంచి లంచాలు వసూళ్లు చేస్తున్నారని.. యూనిఫాం ధరించకుండా ఇలా చేస్తున్నాడని... ఆధారాలతో సహా ఓ బాధితుడు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్ కావడంతో రవాణాశాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. నిజమేనని తేలడంతో మృత్యుంజయరావును తక్షణం సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ అయ్యాయి.