పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం పెదకాపవరంలో అమానుషం చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధ పడుతున్న తల్లిని ఇంట్లోకి రానివ్వకుండా..రోడ్డుపైనే ఉంచేశారు ఆ కుమారులు. రోడ్డుపైన ఆటోలోనే 12 గంటలుగా సూర్యకాంతం(80) తలదాచుకుంది.
కొన్నేళ్లుగా ఆకివీడులోని ఓ ఇంట్లో సూర్యకాంతం అద్దెకు ఉంటోంది. గురువారం వడదెబ్బ తగలడంతో ఇంటి యజమాని ఆస్పత్రిలో చూపించారు. చికిత్స తర్వాత ఇంటి యజమాని...ఆమె కుమారులు ఉంటున్న పెదకాపవరానికి పంపించారు. అయితే అనారోగ్యంతో ఉన్న తనను కుమారులు ఇంట్లోకి రానివ్వట్లేదని తల్లి సూర్యకాంతం ఆవేదన వ్యక్తం చేసింది.