పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి కుమారుడు మృతి చెందారు. జంగారెడ్డిగూడెంలోని ఆర్య వైశ్య కళ్యాణ మండపం ప్రాంతానికి చెందిన వెజ్జు కనకదుర్గ (33), ఆమె కుమారుడు హేమంత్ కుమార్ (17) ద్విచక్ర వాహనంపై ఆర్ అండ్ బి రహదారి మీదుగా నిడమర్రు మండలం వస్తుండగా చేబ్రోలు వద్దకు వచ్చేసరికి బస్సు దాటించే క్రమంలో సందులో నుంచి రహదారి మీద వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టారు. వాహనంపై నుంచి కింద పడిపోవడంతో తల్లి కుమారులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
రోడ్డు ప్రమాదంలో తల్లి కుమారుడు మృతి - చేబ్రోలు యాక్సిడెంట్ వార్తలు
రోడ్డు ప్రమాదంలో తల్లి కుమారుడు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పశ్చిమ గోదావరి జిల్లా చేబ్రోలులో జరిగింది.

రోడ్డు ప్రమాదంలో తల్లి కుమారుడు మృతి