ఆర్ధిక ఇబ్బందులు పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఓ కుటుంబంలో పెను విషాదాన్ని నింపాయి. కొడుకు ఆత్మహత్య చేసుకోగా..అది తట్టుకోలేక అమ్మ,అమ్మమ్మ కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. భీమవరం దిరుసుమభ్రువారివీధికి చెందిన వేమలమంద కార్తీక్ ఈనెల ఏడున
విజయవాడ గవర్నర్ పేటలోని ఒక లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు అతడి మరణవార్తను భీమవరంలో ఉంటున్న బంధువులకు తెలిపారు. కార్తీక్ మరణవార్త వినగానే అతని అమ్మ ఇందిరాప్రియ, అమ్మమ్మ రాధాకృష్ణకుమారి కుంగిపోయారు. కుటుంబానికి