పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పట్టపగలే భారీ చోరీ జరిగింది. వ్యాపారి పూర్ణచంద్రరావు ఇంట్లో మధ్యాహ్న సమయంలో దొంగలు ప్రవేశించి.. 35 కాసుల బంగారంతో పాటు వెండి వస్తువులు, నగదును దోచుకున్నారు. మధ్యాహ్న సమయంలో భోజనానికి ఇంటికి వచ్చిన బాధితుడు తలుపులు పగులగొట్టి ఉండటంతో.. లోపలకు వెళ్లి బీరువాలు తనిఖీ చేశారు. బీరువాలో ఉన్న వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటిని తనిఖీ చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీంతో నిందితుల వేలిముద్రలు సేకరించారు. త్వరలోనే దొంగలను అరెస్ట్ చేస్తామని జంగారెడ్డిగూడెం ఎస్ఐ అల్లు దుర్గారావు తెలిపారు.
జంగారెడ్డిగూడెంలో భారీ చోరీ - జంగారెడ్డిగూడెంలో భారీ చోరీ తాజా వార్తలు
ఓ వ్యాపారి ఇంట్లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. పొద్దునే పని నిమిత్తం బయటకు వెళ్లిన అతను మధ్యాహ్నం భోజనానికి వచ్చే సరికి చోరీ జరిగింది. పట్టపగలే ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి, నగదును.. దుండగులు అపహరించుకుపోయారని బాధితుడు వాపోతున్నాడు.
చోరీ ఇంటిని తనిఖీ చేస్తున్నఎస్ఐ అల్లు దుర్గారావు