ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ ఊర్లో 150 దేవాలయాలు..ఎందుకంటే! - west godavari dst devotional news

దేవతలు స్వయంగా విడిది చేసిన ప్రాంతం... పేరుకు తగినట్లే గ్రామంలో ఇప్పటికీ దేవుళ్ళు, దేవతలు కొలువుదీరి ఉన్నారు. ఒకే గ్రామంలో 150 పైగా దేవాలయాలు ఉండటం విశేషం. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామం గురించి పురాణాల్లో ఏం ఉందో మీరే చూడండి..

వేల్పూరులో ఉన్న వీధికి ఒక్కో దేవాలయం
వేల్పూరులో ఉన్న వీధికి ఒక్కో దేవాలయం

By

Published : Sep 5, 2020, 12:04 PM IST

Updated : Sep 5, 2020, 12:28 PM IST

పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామానికి పురాణ కాలం నాటి చరిత్ర ఉంది. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు తణుకు ప్రాంతాన్ని పరిపాలించారు. తారకాసురుడు పెట్టే బాధలు భరించలేక ప్రజలు పరమేశ్వరునికి మొరపెట్టుకున్నారు. పరమేశ్వరుడు తారకాసురుని సంహరించడానికి కుమారస్వామిని పంపిస్తాడు. కుమార స్వామికి సహాయంగా దేవతలు భూలోకానికి వస్తారు. ఆ సమయంలో వీరంతా ఈ వేల్పూరు గ్రామం ఉన్న ప్రాంతంలోనే విడిది చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఫలితంగా ఈ గ్రామంలో ఏ వీధి చూసినా దేవాలయాలతో ఆధ్యాత్మిక సౌరభం వెల్లి విరుస్తోంది. భక్తిపరులైన ప్రజలు ఆకాంక్షల ఫలితంగానే తమ గ్రామంలో ఎక్కడాలేని విధంగా 150కి పైగా దేవాలయాలున్నాయని స్థానికులు చెపుతారు.

ఆ ఊర్లో 150 దేవాలయాలు..ఎందుకంటే!
Last Updated : Sep 5, 2020, 12:28 PM IST

ABOUT THE AUTHOR

...view details