Sub-Registrar Jeevanbabu Arrested: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సబ్-రిజిస్ట్రార్ జీవన్‌బాబును పోలీసులు అరెస్టు చేశారు. నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లు చేశారనే ఆరోపణలతో..నవంబర్ 25న సబ్-కలెక్టర్ సూర్యతేజ.. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో చేసిన తనిఖీల్లో.. అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. మరుసటి రోజు జిల్లా రిజిస్ట్రార్ చేసిన తనిఖీల్లో.. 48 రిజిస్ట్రేషన్లు నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు నిర్ధారించారు. తహసీల్దార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు..జీవన్‌బాబును అరెస్టు చేశారు.
నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో.. మొగల్తూరు సబ్-రిజిస్ట్రార్ అరెస్ట్ - Inspections at Mogaltur office
Sub-Registrar Jeevanbabu Arrested: ప్రభుత్వ ఆస్తిని అన్యాక్రాంతం చేశారన్న ఆరోపణలతో.. మొగల్తూరు సబ్-రిజిస్ట్రార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
Etv Bharat