'పొగాకుకు గిట్టుబాటు ధర లభించేలా చూస్తా' - tobbaco
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని పొగాకు వేలం కేంద్రాన్ని చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా సందర్శించారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
mla
పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడతానని చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన సందర్శించారు. పొగాకు వేలాన్ని పరిశీలించి రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత నాలుగేళ్లుగా గిట్టుబాటు ధర రాక నష్టాల పాలవుతున్నామని రైతులు ఎమ్మెల్యేకు తెలిపారు. కొనుగోలు సంస్థలు సిండికేట్‌గా ఏర్పడి.. రైతుల కష్టాన్ని దోచుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.